Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో డైరీ సైన్స్, లైఫ్ సైన్స్ విద్యార్థులకు జాబ్ మేళా

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.

సిరవిన్ బయోలాజికల్ లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించబడనుంది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

ఈ జాబ్ మేళాలో జూనియర్ ఆఫీసర్ (అనిమల్ ఫార్మ్ డెవలప్‌మెంట్), ఎగ్జిక్యూటివ్ (అనిమల్ ఫార్మ్ డెవలప్‌మెంట్) పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలతో సోమవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు.

18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9848289763 నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, దశరథం, ముజఫర్, నరేష్, రాఘవేందర్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.