నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డితో రాహుల్ గాంధీ
ముద్ర, నారాయణ పేట:
నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి కి సూచించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక ప్రాంతంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులతో సంఘటన సృజన్ అభియాన్ శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పార్టీ బలోపేతం ఇతర అంశాలపై దిశా నిర్దేశం చేసినట్లు డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ముద్ర ప్రతినిధికి ఫోన్ ద్వారా తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించి పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ కొంతసేపు మాటా మంతి నిర్వహించారు.