Take a fresh look at your lifestyle.

రెవెన్యూ సదస్సు దరఖాస్తులకు పరిష్కారం చూపాలి

  • భూ భారతి చట్టం నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలి.
  • తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: భూ భారతి చట్టంలోని నిబంధనల మేరకు రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆర్డిఓలు, తహసీల్దార్లను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత ఆర్డీఓలు, తహశీల్దార్లతో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన వ్యక్తులకు న్యాయం చేయాలన్నారు. కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయో తెలుసుకుని, ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉంటే పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వరాదని కలెక్టర్ సూచించారు.ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి బోర్డులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రణాళికతో రెవెన్యూ సదస్సులలో వచ్చిన 21వేల దరఖాస్తులను జూలై 10వ తేదీ వరకు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ సంగీత, కలెక్టరేట్ సూపరిటెండెంట్స్, ఆర్దిఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.