మంథని, ముద్ర : మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయిలి ప్రసాద్, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్,ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ లు మాట్లాడుతూ..ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న పనులను చూస్తూ ఓర్వలేక విషం కక్కుతూ,ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ పత్రిక,మీడియా కు కనబడాలనే ఉద్దేశంతో పుట్ట మధు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.మంథని- శివారం గోదావరి నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు, వ్యాపారులకు చిన్న ,సన్నకారు రైతులకు కూరగాయలు, పాలు కాని ప్రతి ఒక్క వస్తువు అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని గ్రామంలోనే జన్మించారని నాయకులు అన్నారు.శివారం పరిసర ప్రాంత ప్రజలు మంథని కి వస్తువులుగాని,ఎరువులు గాని ఇతరత్రా పనుల కోసం వస్తు వెళ్తుంటారని బ్రిడ్జి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.ఆరెంద గ్రామం వద్ద,బోయిన్ పేట వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయలని చెప్తున్నావు,10 సంవత్సరాలు నువ్వేం చేశావని,అధికారం పోయకా అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరో మంథని నియోజకవర్గ ప్రజలకు తెలుసునని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని అన్నారు.ఆరెంద,బోయిన్ పేట బ్రిడ్జి మంత్రి శ్రీధర్ బాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.