ముద్ర ప్రతినిధి మెదక్:
వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. గురువారం కొల్చారం మండలం పోతన శెట్టిపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశమం, రైతులు వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నూతన వంగడాలు, పనిముట్లు, యంత్రాలను ఉపయోగించి పంటల ఉత్పత్తి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.