Take a fresh look at your lifestyle.

అట్టహాసంగా లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం

  • ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ముద్ర, తెలంగాణ బ్యూరో : లోకాయుక్త, ఉపలోకాయుక్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది.గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, ఉపలోకాయుక్తగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, బి.ఎస్.జగ్జీవన్ కుమార్లు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్రంలో అవినీతిని నిరోధించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా హాజరైన వారు ఆశాభావం వ్యక్తం చేశారు.వీరి నియామకం రాష్ట్ర పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఓ ముఖ్య ఘట్టంగా పరిగణించబడుతుంది. లోకాయుక్త , ఉపలోకాయుక్తల నియామకంతో ప్రజలు తమ సమస్యలను, అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారించే ఒక ఉన్నత స్థాయి వేదికగా అందరూ భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.