Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి

  • ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.
  • తొర్రూర్ లో వరి దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కోరారు.తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్ గ్రామంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు మద్దతు ధర ఇచ్చేందుకు రైతు కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించామన్నారు.ప్రభుత్వం సన్న రకం వడ్ల పైన క్వింటాలకు రూ.2320తో పాటు అదనంగా రూ.500 బోనస్ గా చెల్లిస్తుందని తెలిపారు. దీనిని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేస్తోందని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. కష్టనష్టాలకు వచ్చి పండించిన పంటను దళారులను నమ్మి, విక్రయించి మోసపోవద్దని సూచించారు. రైతులందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర్ చారి, మండల మాజీ వైస్ ఎంపీపీ మల్ రెడ్డి యాదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చామ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు ముత్యాల రాజశేఖర్, సంరెడ్డి బలవంత్ రెడ్డి, అనీల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డీసీఎంస్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.