ముద్ర ప్రతినిధి, భువనగిరి
భువనగిరి జిల్లా కేంద్రంలోని భారత యువజన సంఘం కుమ్మరివాడ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగం గా నిర్వహించిన కమిటీ సభ్యులకు ఆర్థిక వెసులుబాటు కల్పించిన తాడూరి బాలకృష్ణ మానస దంపతులను బుధవారం సాయంత్రం ఘనంగా సన్మానించి విఘ్నేశ్వరుడి పటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ కౌన్సిల్ తాడూరి భిక్షపతి, సభ్యులు నరోత్తం, ఆంజనేయులు, బాలశంకర్, మల్లేశ్, చినగారి కృష్ణ, చినగారి బలరాం, కొలిచెలిమి మల్లేశ్ పాల్గొన్నారు.
Next Post