Take a fresh look at your lifestyle.

సివిల్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన సింగరేణి సివిల్ కాంట్రాక్ట్ కార్మికుడు (కార్ పెయింటర్) గొల్లపెల్లి శ్రీనాథ్ (25) శుక్రవారం మృతి చెందారు. మృతుడి తండ్రి గొల్లపెల్లి శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి శుక్రవారం ఉదయం తన కొడుకు శ్రీనాథ్ కుడివైపు కడుపులో నొప్పి రావడంతో చికిత్స కొరకు ఆర్.ఎంపీ వైద్యుడు నాగేష్ దగ్గరికి వెళ్ళారు. పరీక్షించిన వైద్యుడు ఇంజక్షన్ వేసి మందులు ఇచ్చారు. ఇంటికి వచ్చి గోళీలు వేసుకున్న కాసేపటికి శ్రీనాథ్ నోటి నుండి నురుసులు రావడంతో వెంటనే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యంలోనే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. తన కుమారుడు శ్రీనాథ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై వెంకన్నకు తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఆర్ ఎంపీ వైద్యుడు వేసిన ఇంజక్షన్ వికటించడంతోనే మృతి చెందినట్లుగా తండ్రి ఆరోపించారు. కాగా ఇదే విషయంపై మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డిని వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.