Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ కూలర్ బహూకరణ – ఘనంగా కాంగ్రెస్ నేత పొట్టోళ్ల పుట్టినరోజు వేడుకలు

బీబీనగర్, ముద్ర:

బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ అభిమానులు వాటర్ కూలర్ ను బహూకరించారు. కాంగ్రెస్ నేత శ్యామ్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం వివిధ ఆలయాలలో పూజాదికాలు నిర్వహించిన ఆయన అభిమానులు ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రస్తుత వేసవిలో రోగులకు, గర్భిణులకు ఆస్పత్రిలో చల్లటి మంచినీరు అందించడానికి వీలుగా ఈ కూలర్ ను అందించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి పింగల్ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, బీబీనగర్ సర్పంచి పంజాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచి గోలి నర్సింహారెడ్డి, నాయకులు సందిగారి బస్వయ్య, గోలి నరేందర్ రెడ్డి, కాసుల ఆంజనేయులు గౌడ్, బొమ్మగోని బస్వయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి పొట్టోళ్ల హామీ

బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా తన సొంత ఖర్చుతో మరుగుదొడ్లు నిర్మిస్తానని జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ హామీ ఇచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆయన పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పరీక్ష ప్యాడ్స్, కంపాస్ బాక్సులు, కలాలు, ఇతర స్టేషనరీ వస్తువులను అందించారు. ఈ సందర్భంగా అక్కడ మరుగుదొడ్ల నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం శ్యామ్ గౌడ్ రాఘవపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణి చేశారు. అలాగే గ్రామంలో ఉన్న కుట్టు మిషన్ కేంద్రం లో మహిళల అవసరమైన కుట్టు మిషన్ సామగ్రిని బహుకరించారు. ఆయా కార్యక్రమాల్లో రాఘవాపూర్ సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్, ఉపసర్పంచ్ సిలివేరు కవిత మహేష్, వార్డ్ సభ్యులు తొర్పునూరి రవి గౌడ్, న్యాలపట్ల అజయ్ గౌడ్, రక్తని పూర్ణిమ కుమార్, కాంగ్రెస్ నాయకులు రక్తని కృష్ణ, అంబటి చంద్రయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల కుమార్ స్వామి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.