ముద్ర ప్రతినిధి,భువనగిరి :
పట్టణ పరిధిలోని సింగన్నగూడెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం 9వ వార్డు కౌన్సిలర్ బొంతల నర్సింగ్ రావు సందర్శించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వం అందించే పోషక ఆహార పదార్థాలను పరిశీలించి అంగన్వాడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పిల్లలకు మంచి పోషకాలు అందించాలని వారానికి ఒకసారి పిల్లల బరువును తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఆయా పాల్గొన్నారు.