Take a fresh look at your lifestyle.

వ్యక్తి నిర్మాణమే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం

 

దేశ రక్షణ….సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు ముందుండాలి

ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో జిల్లా సంఘచాలక్ ఉప్పలంచ మల్లికార్జున్

ముద్ర, నారాయణ పేట:

మంచి సేవా గుణం… క్రమశిక్షణ… దేశభక్తి… వంటి లక్షణాలను వ్యక్తులలో కల్పించి వ్యక్తి నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని దేశ రక్షణ…సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ముందుండాలని జిల్లా సంఘచాలక్ ఉప్పలంచ మల్లికార్జున్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని షీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో ముఖ్యవక్త వసంతం వెంకటేష్ తో కలిసి హాజరై జిల్లా సంఘచాలక్ ఉప్పలంచ మల్లికార్జున్ మాట్లాడారు. ఆర్ ఎస్ ఎస్ అంటేనే రాష్ట్రీయ స్వయంసేవక్ అని ఆర్ఎస్ఎస్ కు కులమత, ప్రాంతాలతో ఎలాంటి అనుబంధం ఉండదన్నారు. ఈ వర్గం వారైనా ఏ మతం వారైనా స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్ లో చేరి దేశ రక్షణ సమాజ బాగు కోసం పనిచేయవచ్చన్నారు. తల్లి దండ్రులను గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న హిందువులను కులమత ప్రాంతాలవారీగా విడగొట్టి హిందువుల ఐక్యతను దెబ్బతీసిందని…హిందువులు ఐక్యం అవుతే భారత దేశంతో ఏ దేశం పోటీ పడబోదన్నారు. భారత దేశాన్ని విభజించడానికి విదేశీయులు చేసిన కుట్ర అంశాలను వివరించారు. కార్యక్రమంలో డా. మదన్ మోహన్ రెడ్డి, మ్యాడమ్ ప్రభాకర్, కన్నా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.