కూకట్‌పల్లి, ముద్ర:
అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్-2 లో నెలకొన్న త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హామీ ఇచ్చారు.
మంగళవారం కాలనీ వాసులు వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో ఆయనను కలిసి, తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలోని పౌర సమస్యలను శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి అలాగే సంబంధిత అధికారుల వద్దకు తీసుకువెళ్లి, పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తానని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మరియు నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.