ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 26వ వార్డులో సింగన బోయిన నరసింహ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి ఆనంద్ యాదవ్, మాదరబోయిన నరేష్ యాదవ్, స్టేట్ యూత్ బ్రిగేడ్ మేకల బాలు యాదవ్ లు ఓటర్లను కోరారు. శనివారం యాదవ సంఘం నాయకులతో కలిసి వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో అడ్వకేట్ వృత్తిలో ఉండి అందరిని కలుపుకుపోతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే 26వ వార్డు అభ్యర్థి సింగన బోయిన నరసింహ యాదవ్, వివిధ పార్టీలలో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదవ సోదర సోదరీమణులు నిలుచున్న ప్రతి స్థానం గెలవాలని గెలుపు కొరకు యాదవ సామాజిక వర్గం పార్టీలకతీతంగా మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈరపాక నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.