మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదోడికి సొంతిల్లు ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ముద్ర ప్రతినిధి, మెదక్:
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి అన్నారు.
శనివారం నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రితో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడపిల్లల పాలిట వరం అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న వారికి బిల్లుల సమస్యలపై తొందరలో ప్రత్యేక సమావేశం ద్వారా చర్యలు చేపడతామన్నారు. ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు బాగా చదువుకుని అన్ని రంగాలు రాణిస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని నర్సాపూర్ నియోజకవర్గంలో పటిష్టంగా అమలు పరచాలన్నారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక లో భాగంగా అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రజలకు చేరువ చేయడానికి జిల్లాలో సమర్థవంతంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టడం, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పాలనాపరంగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు
నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డితో కలిసి మంత్రి
శంకుస్థాపన చేశారు.
నారాయణపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ…నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు
.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని నమోదు పెంచుకోవాలని ఆ దిశలో జరిగే బడిబాట కార్యమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం ఉంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభం
నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఇందిరాగాంధీ ఆ రోజుల్లో పేద ప్రజలకు గరీబి హటావో అనే నినాదంతో అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని చెప్పి లబ్ధిదారులకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ ఆర్డిఓ రమాదేవి,
మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీరాజ యాదవ్, గ్రంధాలయ చైర్మన్ చిలుముల సుహాసినిరెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి,
జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తదితరులు పాల్గొన్నారు.