Take a fresh look at your lifestyle.

50వ డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా..కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు..

 

కరీంనగర్ నగరపాలక సంస్థలో 50వ డివిజన్ ను క్లీన్ డివిజన్ గా మార్చి, ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. చెత్త సేకరణ నిమిత్తం 50 డివిజన్ కు నూతన నూతన ట్రాక్టర్ కేటాయించిన సందర్భంగా శనివారం రోజున ఆ వాహనాన్ని బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రారంభించి మాట్లాడారు. డివిజన్లో చెత్త సేకరణ నిమిత్తం నూతన ట్రాక్టర్ కేటాయించిన కరీంనగర్ నగరకు పాలక సంస్థ మేయర్, కమిషనర్ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా డివిజన్లో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ కార్యక్రమాలు నిరంతరం సక్రమంగా జరిగేలా చేస్తామన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ప్రజలను ఆయన ఈ సందర్భంగా కోరారు. రోడ్లపైన చెత్తాచెదారాన్ని వేయవద్దని, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేయాలని సూచించారు. డివిజన్ ను క్లీన్ డివిజన్ గా మార్చడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ప్రజలందరికీ సహాయ సహకారాలతో, సూచనలతో డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి నిరంతర కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.