రూ. 50,016 అందజేసిన మంత్రి అడ్లూరి..
ధర్మపురి:
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ తనవంతు చేయూతను అందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రూ. 50,016 లను మంత్రి అన్నదాన కమిటీ సభ్యులకు అందజేశారు.