- రామన్నగట్టు రిజర్వాయర్ తోనే శాశ్విత పరిష్కారం
- బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్ర శేఖర్ నాయక్
ముద్ర,పానుగల్: పానుగల్ మండలంలోని అన్నారం,అన్నారం తండా గ్రామాలలో రైతులకు సాగు నీటి కష్టాలు రావడంతో సాగు నీటిని విడుదల చెయ్యాలని సోమవారం రైతులు రోడ్డు పై ధర్నా నిర్వహించారు.ఈ రైతు ధర్నాకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్ర శేఖర్ నాయక్ హాజరై మాట్లాడారు.మంత్రి నియోజకవర్గంలో గ్రామాలలో రైతులకు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయనీ అన్నారు.మంత్రి స్పందించి వెంటనే రైతాంగానికి సాగు నీటి కష్టాలు తీర్చాలన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు సాగునీటి కష్టాలు, త్రాగునీటి కష్టాలు,విద్యుత్ కష్టాలు లేవన్నారు. రైతుల శ్రేయసే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగాన్ని విస్మరించిందన్నారు.కిష్టాపూర్ గ్రామ సమీపంలో రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణం కోసం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి ల కృషితో రామన్న గట్టు రిజర్వాయర్ మంజూరుకు కృషి చేశారని,ప్రస్తుత మంత్రి జూపల్లి రిజర్వాయర్ మంజురును మరుగున పడవేశారన్నారు.రిజర్వాయర్ ఏర్పాటుతోనే సాగు,త్రాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు.రైతుల ధర్నా పై విషయం తెలుసుకున్న సీఐ కృష్ణ,ఎస్ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా ను విరమింపచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేస్త్రి రాములు,కురుమూర్తి,గోపాల్ నాయక్,రాంసింగ్,రవి నాయక్,బాలు నాయక్,మహేందర్, రైతులు పాల్గొన్నారు.
