ముద్ర కాప్రా
మహిళలు స్వయం శక్తితో అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మ రెడ్డి కోరారు.మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నెహ్రు నగర్ లో స్నేహ మహిళా మండలి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా మానులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, స్వయం సాధన ద్వారా మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని,కుటుంబం నుండి దేశ స్థాయి వరకు మహిళల నాయకత్వం అవసరం.ఆత్మవిశ్వాసం, సంకల్పం ఉంటే మహిళలు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరు. మహిళల సాధికారతే సమాజ పురోగతికి మూలాధారం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మండలి ప్రతినిధులు గొర్ల మధన జగన్ , రాములమ్మ , సంతోష , సుజాత , మాజీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.