- రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు
- వీరిలో పురుష ఓటర్లు 1,66,41,498 మంది
- మహిళా ఓటర్లు 1,68,67,735 మంది
- థర్డ్ జెండర్ ఓటర్లు 2,829
- అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,65,982 మంది ఓటర్లు
- అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మొత్తం ఓటర్ల జాబితాను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 1,66,41,489 మంది, మహిళా ఓటర్లు 1,68,67,735 మంది, థర్డ్ జెండర్‌కు చెందిన వారు 2,829 మంది ఉన్నారు. 18-19 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య 5,45,026 గా ఉంది. వృద్ధ ఓటర్లు (85 ఏళ్ళు దాటిన వారు) 2,22,,091 మంది ఉన్నారు. ప్రవాస భారతీయ (ఎన్ ఆర్ ఐ) ఓటర్లు 3,591 మంది ఉన్నారు. ప్రత్యేక సామార్థ్యం గల వ్యక్తులు (పీడబ్ల్యూడీ) ఓటర్లు 5,26,993 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లి లో 7,65,982 మంది ఓటర్లు నమోదు అయ్యారు. అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.