Take a fresh look at your lifestyle.

ఏసీబీ.. కేటీఆర్​.. మధ్యలో లాయర్​

  • ఏసీబీ ఆఫీస్​ దగ్గర హైడ్రామా
  • ఆఫీస్​ వరకున్యాయవాదితో వచ్చిన కేటీఆర్
  • లాయర్​ ను లోనికి అనుమతించని ఏసీబీ
  • వెంటనే వెనుదిరిగిన మాజీ మంత్రి
  • 9న మళ్లీ నోటీసులు జారీ చేసిన ఏసీబీ
  • నేడు ఈడీ విచారణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఫార్ములా ఈ… కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యేందుకు ఏసీబీ ఆఫీస్ కు వచ్చిన కేటీఆర్.. తనతో తన లాయర్లను అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే తిరిగి వెళ్లిపోయాడు. దీంతో ఆయనకు ఏసీబీ మరోసారి కేటీఆర్‎కు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరుకావాలని కేటీఆర్ ను ఆదేశించింది. కాగాకాగా సోమవారం ఉదయం ఏసీబీ ఆఫీసుకు విచారణ కోసం కేటీఆర్ రావడంతో అక్కడ కొద్దిసేపు హై డ్రామా చోటుచేసుకుంది. విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన  ఆయనను ఏసీబీ ఆఫీసు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారణకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దీనికి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని, అది తన హక్కు అని  అన్నారు. విచారణ లాయర్ల సమక్షంలో జరగడం ఇదేమీ కొత్త కాదన్నారు. దీనిపై వేసిన కేసు ప్రస్తుతం  కేసు విచారణలో ఉందన్నారు. అరెస్ట్ చేయకూడదని సైతం హైకోర్టు చెప్పిందని.. చట్ట ప్రకారం తాను నడుచుకుంటున్నట్లు చెప్పారు. అరగంటకు పైగా వేచి ఉన్నా, లాయర్ సమక్షంలో విచారణకు అనుమతివ్వకపోవడంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు. దీంతో కేసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో న్యాయవాదులతో సంప్రదించిన మీదట ఏసీబీ అధికారులు  మరోసారి  కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు.  తాజాగా జారీ చేసిన నోటీసుల్లో గురువారం విచారణకు రావాలని  ఆదేశించింది.
 ఈడీకి కేటీఆర్ లేఖ
ఈ కేసులో  నేడు ( 7వ తేదీ) విచారణకు రావాలంటూ ఈడీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది.  అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా..  డుమ్మా కొట్టారు.  దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది.  8వ తేదీన బీఎల్‌ఎన్‌ రెడ్డి, 09వ తేదీన అరవింద్‌ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు పైన ఉన్న గౌరవంతో… హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని న కేటీఆర్ కోరారు. ఈ మేరకు  లేఖ ద్వారా ఈడీకి కేటీఆర్ సమాధానం పంపారు.

Leave A Reply

Your email address will not be published.