ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదర సోదరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి, సోదరభావం, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, భువనగిరి తహసీల్దార్ జగన్, కాంగ్రెస్ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.