Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 2 నుండి గ్రామ సభలను విజయవంతం చేయాలి-అధికార యంత్రంగానికీ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశం

షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేసుకోవాలి
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ఏప్రిల్, 2 నుండి  నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు, ఆర్డీఓలు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు సమార్దవంతంగా నిర్వహించాలని, పాఠశాల/పంచాయతీభవన్/బహిరంగ ప్రదేశం/ ఏదైనా ఇతర  అనువైన వేదికను ఏర్పాటు చేసి ఉదయం 10 గంటలకు ప్రారంభించాలని, గ్రామ వార్డు సభలలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, మంత్రులకు, ఎంపీలు, ఎమ్మీల్సీలు, ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, ఆదేశించారు. గ్రామ సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించాలని, ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చదివి వినిపించాలని సూచించారు.  ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాల పై చర్చించాలని, గ్రామ సభలలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు సంబంధిత శాఖల అధికారులు గ్రామ పెద్దలు స్వయం సహాయక సంఘాల సభ్యులు యువత రైతులు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఉండేలా చూడాలని సూచించారు. మహిళలు వృద్ధులు కూర్చునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని,  ప్రదర్శన కోసం స్క్రీన్ మరియు ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, నీడ కోసం ఏర్పాట్లు చేయాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ బ్యానర్ ప్రదర్శించాలని సూచించారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఆర్డీఓలు, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణ రెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, సిపిఓ సౌమ్య, సంక్షేమ శాఖల అధికారులు రామరావు, నవీన్ కుమార్ రెడ్డి, కేషు రామ్, పద్మావతి, పిడి డీఆర్డీఏ శ్రీలత, జీఎం ఇండస్ట్రీస్ శ్రీలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి ఉషా, ఉద్యానవన శాఖ అధికారి సురేష్, మత్సశాఖ అధికారి పూర్ణిమ, పిడి హౌసింగ్ చంప్లా నాయక్, విద్యాశాఖ అధికారి సుశిందర్ రావు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.