Take a fresh look at your lifestyle.

రేవంత్ కు రైతుల అప్పులు పట్టవు … ఎక్స్ వేదికగా ధ్వజమెత్తిన హరీశ్ రావు

  • దావోస్ డప్పులే ముఖ్యం
  • రైతు భరోసా చిల్లర పంచాయతీగా కనిపిస్తోందా….
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల అప్పులు పట్టవుగానీ….దావోస్ డప్పులు (గొప్పలు) మాత్రం ముఖ్యమని మాజీ మంత్రి  హరీశ్ రావు ధ్వజమెత్తారు. పెట్టుబడులపై డాంబికాలు తప్ప…మరేమీ లేదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కొత్త కంపెనీ కూడా లేదన్నారు. ఉన్న కంపెనీలే ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ీ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సీఎం మీడియా సమావేశాలు ఎలా ఉంటున్నాయంటే ….పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు.ఆయన  ప్రెస్ రిలీజులు, మీడియా కవరేజులు,  ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదన్నారు. ఎప్పుడో అయిపోయిన దావోస్ కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు అని ప్రశ్నించారు. దావోస్ లో జరిగే ఎంఓయులు అన్నీ కూడా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ మాత్రమేనని పేర్కొన్నారు. ఎవరైనా ఓపెన్ టెండర్ లో రావాల్సిందేనని ఆర్థిక మంత్రి భట్టి అంటే, రేవంత్ ఏమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇందులో ఎవరి మాటలు నిజమని ప్రశ్నించారు.  పొంతన లేకుండా మీరు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించిందన్నారు. అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయిందన్నారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటావా? అని ధ్వజమెత్తారు.
ఇంతకు ముందు రైతు బంధును బిచ్చం అన్నావు…..ఇప్పుడేమో రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నావని మండిపడ్డారు.సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోగా…. చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యిందన్నారు. అది కాస్త ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెట్టడం ఎంత వరకు సమంజసమని  ప్రశ్నించారు..మీడియా ప్రతినిధులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అంటున్నావని మండిపడ్డారు.అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టీ మీ ప్రచారం వినాలా? అని ప్రశ్నించారు. రేవంత్ కురైతుల అప్పులు ముఖ్యమా.?  లేదా దావోస్ డప్పులు ముఖ్యమా..? చెప్పాలని డిమాండ్ చేశారు.మీ సెల్ఫ్ డబ్బా కు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లిందన్నారు. ఇకనైనా కళ్ళు తెరవాలనికి రేవంత్ రెడ్డికి సూచించారు. రేవంత్ లో అటెన్షన్ డిక్రీ సింగ్ డిజార్డర్ మొదలైందన్నారు. అందుకే ఆయన మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగి పోయిందన్నారు. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని సీఎంకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.