ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జుక్కల్ నియోజకవర్గంలో సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్ పూల మొక్కలు అందచేసి స్వాగతం పలికారు.జుక్కల్ నియోజకవర్గం మద్దెలచెరువు – పిట్లం రోడ్,తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ ను, బిచ్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
