Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి

 
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ – సిపిఐ కలిసి వెళ్తున్నామని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయడం లో కమ్యూనిస్ట్ లు ముందంజలో ఉంటారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్త ఒప్పందంలో భాగంగా పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్తున్నామన్నారు.
భువనగిరి, భూదాన్ పోచంపల్లి రెండు మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ జెండా ఎగురావేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రంజక పాలన కు కేరఫ్ అడ్రెస్స్ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వమని ప్రజలు గమనించాలని హెచ్ఎండిఏ కింద 56కోట్ల నిధులు తెచ్చిన ఘనత మాకుందన్నారు.
అధికారం లోకి రాగానే పట్టణంలో బృహత్తర కార్యక్రమాలు చెప్పట్టి అభివృద్ది అంటే ఏంటో చూపించాం…ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. బిఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ది కాంగ్రెస్ చేస్తుందని
కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తంగేళ్లపల్లి రవికుమార్, ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, కూర వెంకటేష్, సిపిఐ నాయకులు గోదా శ్రీరాములు, ఏశాల అశోక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.