ముద్ర , చిలుకూరు ….. : కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కెసిఆర్ పై తప్పుడు కేసులను బనాయిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అక్కినపల్లి జానకి రామాచారి అన్నారు. ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి నల్లజెండాలతో రాస్తారోకో నిర్వహించారు. అక్కినపల్లి జానకి రామాచారి మాట్లాడుతూ, ఫోన్ టాపింగ్ కేసు పేరుతో ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు అవమానమని, కెసీఆర్ పై సిట్టు అధికారుల దర్యాప్తు ప్రభుత్వ దివాలా కోరు తనానికి నిదర్శమని అన్నారు. కెసిఆర్ ని ఎదురుకోలేక కాంగ్రెస్ బిజెపి తోడుదొంగల ఒకటై పనికిమాలిన చెత్త ఆరోపణలు చేస్తున్నారని, ఈ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకోవటానికి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రజల తరఫున ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లను ఎదుర్కోలేక ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని, ఇది స్కీముల ప్రభుత్వం కాదని స్కాముల ప్రభుత్వమని ప్రజలు ఎప్పుడో గమనించారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ అన్నపూర్ణ, మాజీ జెడ్పిటిసి బట్టు శివాజీ నాయక్, మాజీ జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్.కె జానీ మియా, పిఎసిఎస్ మాజీ చైర్మన్ అలసకాని జనార్ధన్, తాళ్లూరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, వార్డ్ మెంబర్ అల్లి వీరబాబు, షాకీర్, ఎస్.కె పాషా, వాసు, రవీందర్, నందలాల్, శంకర్, పిచ్చయ్య, నాగేంద్ర, హరిబాబు,మాదారపు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.