Take a fresh look at your lifestyle.

మున్సిపాల్ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం బీఆర్ఎస్ డ్రామాలు మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్..

 

యాంకర్: మున్సిపాల్ ఎన్నికల్లో సెంటిమెంట్ ను రగిలించి ఓట్లు దండుకోవడానికి సిట్ విచారణపై మాజీ మంత్రి కేటీఆర్, హరీష్కు డ్రామాలు ఆడుతున్నారమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణపై మంత్రి స్పందించారు.

వాయిస్ ఓవర్: ఫోన్ ట్యాఫింగ్ విషయంలో కేసీఆర్ ను సిట్ విచారణకు పిలిస్తే దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా శాంత్రి యాత్రలు ఇంకో యాత్రలు అని పిలుపునిస్తు కాంగ్రెస్ పార్టీపై బుదరజల్లే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని మంత్రి అన్నారు. మున్సిపాల్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారుల భూములు రాయించుకున్నది, డబ్బులు వసూళ్లు చేసింది నిజం కాదా మంత్రి అని ప్రశ్నించారు.

మీరు చేసిన పాపాలు కాళేశ్వరం ఒక్కటి అయితే రెండవది ఫోన్ ట్యాపింగ్ అని మంత్రి అడ్లూరి మండి పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దుర్మగమైన చర్యగా మంత్రిగా అభివర్ణించారు. రాష్ర్టంలో 10ఏళ్లు అధికారంలో ఉండి కల్వకుంట్ల రాజ్యాన్ని తీసుకువస్తామని భావిస్తే ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అన్నారు. పదేళ్ల పాటు మీరు చేసిన పాపాలు, అక్రమాలు ఒకోక్కటి వెలుగులోకి వస్తుంటే జనం ఆచ్చర్యపోతున్నారమని మంత్రి అడ్లూరి అన్నారు.

దేశంలోని పేద ప్రజలకు ఉపాధి కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండేంది మంత్రి అన్నారు. పేద ప్రజలకు 100 రోజు పని కల్పిస్తే ఆకుటుంబానికి ఎంతో చేయూతగా ఉండేదని ఇలాంటి ఉపాధిహామీని రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎందుకు ఫాంహౌజ్ నుంచి బయటికి వచ్చి కేసీఆర్ మాట్లాడం లేదని మంత్రి ప్రశ్నించారు.

వ్యక్తిగతంగా అతని నోప్పి అయినప్పుడు మాత్రమే రాష్ర్ట ప్రజలు విఫరితమైన అందోళనలో ఉన్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రులు వ్యవరిస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వాస్తవాలు ఎప్పుడు దాగవని, సిట్ ఏలాంటి ఆధారాలు లేకుండ నోటిసులు ఇవ్వదని మంత్రి అడ్లూరి అన్నారు. విచారణ చేస్తేనే మీరు దోషులా కాదా అనే విషయం తెలుస్తుందని మంత్రి అన్నారు.

బీఆర్ఎస్ నేతలు తప్పు చేసి దొరికి పోయారని ఏలా తప్పించుకోవాలో తెలియక సెంటిమెంట్ను రగిలిస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుంటు పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గతం తీసుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు రోడ్డు మీద తిరిగే వారు కాదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని మంత్రి అన్నారు. ఆవిధంగా ముందుకు సాగుతున్నామని లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మీరు చేసిన పాపాలకు సిట్ తో పాటు రేపు కాళేశ్వరం విషయంలో సీబీఐ సైతం వస్తుందని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం అడ్డంపెట్టుకొని చేసిన దోపిడికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు. తోడ పుట్టిన చెల్లి, కన్న బిడ్డ ఫోన్ ట్యాపింగ్ పై చేసిన ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.