Take a fresh look at your lifestyle.

8వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

తాండూర్. ముద్ర: కాంగ్రెస్ పాలనలోనే 8వ వార్డ్ లో ఇల్లు నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి సమీప దూరంలో నెలకొని ఉన్న రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలు అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాయని, గత పాలకులు ఈ యొక్క వాడను పట్టించుకున్న పాపాన పోలేదని, తాండూర్ మున్సిపల్ పరిధిలోనే అత్యధిక ఓటర్లు కలిగిన ఈ వార్డును అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సాయప్పను గెలిపిస్తే ఈ వార్డ్రూపు రేఖలు మారుస్తానని, అలాగే కాలనీలో శాంతిభద్రతలదృష్ట ప్రశాంత వాతావరణం నెలకొనేలా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ వార్డును తీసుకొస్తానని, ప్రతి ఒక్కరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. ప్రచార పర్వంలో కౌన్సిలర్ అభ్యర్థి తలారి సాయప్ప, మాజి కౌన్సిలర్ వెంకన్న గౌడ్, పార్టీ నాయకులు అబ్దుల్ రహుఫ్, ముజీబ్, జిలాని, నాసిర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.