Take a fresh look at your lifestyle.

బి ఆర్ ఎస్ బంద్ ను కరీంనగర్ ప్రజలంతా వ్యతిరేకించండి… బంద్ కు సహకరించకండి…

 

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యల పై ప్రశ్నించండి… గళ మెత్తండి…

బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు…

ముద్ర, కరీంనగర్ :
బిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ఉనికి , ప్రజల ఆదరణను కోల్పోయిందని అందుకే కరీంనగర్ బంద్ పేరిట రాజకీయ డ్రామాలు మొదలుపెట్టిందని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. శుక్రవారం రోజున కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలను సమర్ధిస్తూ బిఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చిందా ? అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి , కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును రాజకీయ వేదికగా మార్చుకొని ఇష్టాను సారంగా, అడ్డగోలుగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, . అలాంటి వ్యాఖ్యలను బిజెపి శ్రేణులు జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని నిలదీయడానికి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ , పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాక్యుధం జరిగి , గొడవకు దారితీసిందన్నారు. అసలు ఈ గొడవకు ప్రధాన కారణమైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నీ బిఆర్ఎస్ సమర్థించేలా బంద్ కు పిలుపునివ్వడం విచిత్రంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వ అధికారిక కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును రాజకీయ వేదికగా మార్చుకొని, స్థానిక కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పై అనవసర వ్యాఖ్యలు చేయడమే తప్పయితే , కౌశిక్ రెడ్డిని సమర్థించేలా బిఆర్ఎస్ పార్టీ వ్యవహరించడం , తిరిగి కరీంనగర్ బంద్ కు పిలుపునివ్వడం శోచనీయమన్నారు. కౌశిక్ రెడ్డి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేంద్రమంత్రి బండి సంజయ్ పైచేసిన వ్యాఖ్యలను కరీంనగర్ ప్రజలందరూ వ్యతిరేకించాలని, బంద్ కు సహకరించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.