ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎఫ్ సీఐ కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ ఛైర్‌పర్సన్‌గా ఎండీ డీకే అరుణను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.ఈ కమిటీ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో సమస్యలపై అధ్యయనం చేయనుంది.తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు.