ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్, బస్వాపూర్, చందుపట్ల, వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల కంటే ఎక్కువ స్థాయిలో ధాన్యం తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నదని, ఇది రాష్ట్ర రైతుల కష్టానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులు తమ పండించిన ధాన్యాన్ని మధ్యవర్తుల వద్ద కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అనంతరం వడపర్తి గ్రామంలోని ఐకేపీ ఆవరణలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు, చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ & షాదీ ముబారక్ చెక్కులను భువనగిరి పట్టణానికి చెందిన 40 మంది, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు మొత్తం 64 మందికి రూ. 64,07,424 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.