నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
కడు పేదరికంలోనూ ఉన్నత చదువులే లక్ష్యంగా ఉత్తమ ర్యాంకు సంధించి చదువుతున్న బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకి దాతలు చేయూతనందించారు. మంగళవారం నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా క్లాస్మేట్ క్లబ్, టియుడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థిని తండ్రి రామస్వామికి నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్, శ్యాం ప్రసాద్ లాల్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ లు మాట్లాడుతూ ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కాకూడదని లక్ష సాధన అనంతరం నిరుపేదలకు సహాయ సహకారాలుగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి దాతృత్వ స్వభావం ప్రతి ఒక్కరిలో అలవర్చుకోవాలని నిరుపేద విద్యార్థులకు చేయూతను అందించాలన్నారు. క్లాస్మేట్ క్లబ్ సేవలు అమోఘమైనదని క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో 365 రోజుల కార్యక్రమంలో భాగంగా 111వ రోజు వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ప్రైజులు బౌకరణ దాతలు డాక్టర్ ఆకారపు భాస్కర్, వాస రాఘవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.రమణ కుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పోలా శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి కె.పి ప్రసాద్, టియుడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పలుస విజయ్ కుమార్,, పట్టణ కమిటీ అధ్యక్షులు బొడ్డుపల్లి మల్లేష్, శ్రీనివాస్ యాదవ్, కొండకింది మాధవరెడ్డి, జయప్రసాద్ తదితరులు ఉన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.