Take a fresh look at your lifestyle.

మాదిగలకు  11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి – ఎమ్మార్పీఎస్ డిమాండ్ 

 ముద్ర మల్కాజిగిరి 
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం మాదిగల జనాభా ప్రాతిపదికన కనీసం 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) డిమాండ్ చేసింది.
మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్పీ ఆధ్వర్యంలో
జిల్లా అధ్యక్షులు పంగ ప్రణయ్  మాదిగ అధ్యక్షతన నేరేడ్మెట్  అంబేద్కర్ భవన్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ,ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు కేశపాగ రాంచందర్ మాదిగ లు మాట్లాడుతూ
ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ  గతం నుంచే మాదిగల జనాభా 10–11 శాతం మధ్యలో ఉంటుందని పేర్కొంటూ వచ్చారు.ఇటీవల నిర్వహించిన కుల గణన నివేదికతో ఆ విషయం మరింత స్పష్టమైంది. అయితే ఈ గణన ఇంకా పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా జరగలేదని,పూర్తిస్థాయి పారదర్శక సర్వే నిర్వహిస్తే మాదిగల జనాభా ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు.ప్రస్తుతం కేటాయించిన 9 శాతం రిజర్వేషన్లను కొంతమంది మేధావులు స్వాగతించడం దురదృష్టకరం,వారి స్వార్థం కోసం చేసింది గా,ఇది మాదిగ జాతి హక్కులను దెబ్బతీసే చర్యగా  అభిప్రాయపడింది.జాతి ప్రయోజనాలను పక్కనబెట్టి పాలకుల మెప్పు కోసం పనిచేసిన వారిని మాదిగ సమాజం ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.