ముద్ర, నారాయణ పేట :
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లే – అవుట్ లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ లే అవుట్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ల అనుమతుల జారీ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమతుల కోసం కమిటీ కి వచ్చిన జిల్లా కేంద్రానికి సంబంధించి నాలుగు లేఅవుట్ల దరఖాస్తుల పై అన్ని శాఖల అధికారుల క్లియరెన్స్ ను కలెక్టర్ అడిగారు. అయితే లే అవుట్ కమిటీ కి వచ్చిన నాలుగు లే అవుట్ లలో రెండు లే అవుట్ లకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ అనుమతులు జారీ చేసింది. మిగతా రెండు లే అవుట్ల అనుమతులను కమిటీ నిరాకరించింది.