Take a fresh look at your lifestyle.

రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్:
హవేలిఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 20 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు పనులను సర్పంచ్ చామంతుల సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. స్థానిక దేవాలయానికి వెళ్లే మార్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శీల కనకమ్మ, గ్రామ పంచాయతీ సభ్యులు బయికాడి రాజు, శెగ్గరి స్వప్న,బుర్కా యాదగిరి, కోరబోయిన నాగమణి, కోరబోయిన వసంత,మామిండ్ల నర్సింలు,
గంట నాగమణి,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.