ముద్ర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది.ఈ మేరకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు రవి కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగం పై గత నెల 5 నా షో కాజ్ నోటీసు జారీ చేశారు.దీనిపై ఫిబ్రవరి 12 లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.ఐతే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.