యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఆదివారం కాలనీ లోని మంజు అబాకస్ అకాడమీ చిన్నారులు విత్తన బంతులు తయారు చేశారు. “సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్” అనే నినాదంతో వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని, స్తానిక మంజు అబాకస్ అకాడమీ (స్వచ్ఛంద సంస్థ) ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ విత్తన బంతుల తయారీ చేపట్టారు. జామ, సపోటా, నారింజ, వంటి పశుపక్షాదులకు ఉపయోగపడే విధంగా ఈ విత్తన బంతులను తయారు చేయడం జరిగిందని అబాకస్ అకాడమీ నిర్వాహకురాలు మంజు తెలిపారు. ఈ విత్తన బంతులను సింగరేణి యాజమాన్యం సహకారంతో ఓపెన్ కాస్ట్ గనుల్లోని ఓబీ (మట్టి) డంపింగ్ యార్డుల్లో వేయడం జరుగుతుందని, ఆమె తెలిపారు.