Take a fresh look at your lifestyle.

జేఏసీ కి శ్రమశక్తి అవార్డు

ముద్ర ప్రతినిధి,హనుమకొండ:  కార్మిక దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డులను హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఎమ్మెల్యేలు, హాజరు కాగా రాష్ట్ర వెజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ అధ్యక్షతన వార్డుల పురస్కారం నిర్వహించారు ఇందులో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరియు కాజీపేట డివిజన్ కోసం అనేక పోరాటాలు, నిరాహార దీక్షలు చేసిన తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ కు శ్రమశక్తి అవార్డును కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం. దాన కిషోర్ చేతుల మీదుగా అవార్డు ను అందుకున్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఐదుగురికి మాత్రమే అవార్డు ఇవ్వడం జరిగింది. తదనంతరం ఐఏఎస్ అధికారి దాన కిషోర్ చేతుల మీదుగా అవార్డు గ్రహితలందరికి
అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.