Take a fresh look at your lifestyle.

స్పీకర్ తనయ రాజకీయ ఆరంగేట్రం

 మున్సిపల్ బరిలో అనన్య

కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా అనన్య రాజకీయంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధిష్టానం ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు వికారాబాద్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తనయ రాజకీయం ప్రవేశం చేశారు. స్పీకర్ తనయ అనన్య మున్సిపల్ కౌన్సిలర్ బరిలో మొదటిసారిగా నిలిచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు. రాజకీయ సమాలోచనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అనన్యకు మద్దతుగా మునిసిపల్ పట్టణంలోని సీనియర్ నాయకులందరూ మద్దతు ప్రకటించి అనన్య గెలుపు కోసం సర్వశక్తులను వడ్డించి గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మధు కాలనీలో వార్డు కౌన్సిలర్ గా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో అత్యధిక శాతం వార్డులను కైవసం చేసుకునేలా సమన్వయ కమిటీతో పాటు సీనియర్ నాయకులు అందర్నీ కోర్ కమిటీగా 20మంది నాయకులతో సమన్వయ కమిటీ వేశారు. గెలుపు కోసం లెక్క ప్లాన్ వేస్తున్నారు. బిఆర్ఎస్కు దీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాజీ మెజారిటీతో గెలిపించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు

Leave A Reply

Your email address will not be published.