Take a fresh look at your lifestyle.

రూ. 13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసి చైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 13 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో సీసీ రోడ్ల శంకుస్థాపననలకు రూ.6.58,50,000, మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు డివిజన్లో శంకుస్థాపనలకు రూ. 4,72,00,000 కోట్లతో శంకుస్థాపనలు చేయగా గచ్చిబౌలి లో రూ.15 లక్షల్తో నిర్మించిన కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. వివిధ డివిజన్ లలో జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోస్తావాలలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.