Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే క్యాన్సర్ దరిచేరదు

  • వ్యాయామం,వాకింగ్ తో ఆరోగ్యం.
  • ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రోజు వారి జీవన విధానంలో బాగంగా ప్రతి ఒక్కరు వ్యాయామం, వాకింగ్ అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ ఓల్డ్ హైస్కూల్ లో జగిత్యాల ఐ ఎం ఏ, కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ చర్యలపై కరపత్రం ప్రచారం వల్ల అవగాహన పెరుగుతుందని, ఇలాంటి ఉచిత పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.మూఢనమ్మకాలు నమ్మవద్దని సైన్స్ ను నమ్మి ముందస్తు చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందన్నారు.ప్లాస్టిక్ వాడకం నివారణ చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందని,రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ముందస్తు పరీక్షలు ఉత్తమం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, ఐ ఎం ఏ అధ్యక్షుడు డా.హేమంత్, డా.మోహన్ రెడ్డి, డా. వజ్రాలగంగాధర్, డా.మధు, డా.శ్రవణ్, కార్యదర్శి డా.శ్రీనివాస్, కోశాధికారి డా.సుధీర్, మాజీ అధ్యక్షులు డా. సురేష్, మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్,మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి,డా. బాను, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.