Take a fresh look at your lifestyle.

ఎస్పీ ని కలిసిన మున్సిపల్ చైర్మన్

ముద్ర, వనపర్తి:
వనపర్తి మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన శ్రీమతి ఎస్ ఎల్ ఎన్, మాదవి రమేష్ జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,*ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ నూతనంగా ఎన్నికైన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరిపాలన, పట్టణ అభివృద్ధి, ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మహిళల రక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రజా సమస్యల పరిష్కారం సమాజంలో విశ్వాసం, శాంతి, ప్రజల జీవన ప్రమాణాలు, భద్రత, క్రమశిక్షణ, చట్టపరమైన అవగాహన అన్నీ కలిసి వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల అవసరాలు, భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించాలని ఎస్పీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.