Take a fresh look at your lifestyle.

శాసనసభ్యుల సొంత గడ్డపై గురుకుల ఫలితాల్లో మెరిసిన తుడుకుర్తి విద్యార్థులు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా శాసనసభ్యుల సొంత గ్రామమైన తుడుకుర్తిలోని MPPS పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మొదటి విడత గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఈ పాఠశాల నుండి మొత్తం 9 మంది విద్యార్థులు గురుకుల సీట్లను సాధించడం విశేషంగా నిలిచింది.

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ విజయం మరింత ఉత్సాహాన్ని నింపిందని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు

విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఫలితంగానే ఈ విజయాన్ని సాధించారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమావతి, తరగతి ఉపాధ్యాయుడు రాజేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు నహీదా, మాధవి, హరీష్ విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.