ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు తొందరగా అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రంథాలయంలోని పాఠకులను ప్రతి ఒక్కరిని అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు వీలైనంత తొందరగా అందుబాటులో తేవాలని ప్రణాళికా రూపొందించాలని సూచించినారు. వాటర్ ప్లాంట్ కొత్తది ఏర్పాటు చేస్తానన్నారు. ఎన్ని శాఖ గ్రంథాలయాలు ఉన్నాయో తెలుసుకున్నారు. రామన్నపేట, వలిగొండ, ఆలేరు, తుర్కపల్లి, గ్రంథాలయాలను సందర్శించి వాటి మరమ్మత్తులకు చేపట్టుటకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తీ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం సుధీర్ శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.