Take a fresh look at your lifestyle.

ప్రజావాణి ఆర్జీలను పెండింగులో పెట్టొద్దు -అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

 

 

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి  అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 53 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం (53) ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖవి 10, ఇతర శాఖలవి 43, మొత్తం 53  దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.