Take a fresh look at your lifestyle.

చేనేత హస్తకళ మేళ ప్రారంభం

 
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
మహబూబ్ నగర్ లోని శిల్పరావం లో సోమవారం చేనేత వస్త్రాలు, హస్తకళ మేళా ప్రారంభమైంది.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ,గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీ సరస్ ఫెయిర్ జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా, నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆర్టిఫిషియల్ ఆభరణాలు, హెర్బల్ ప్రొడక్ట్స్ వాడకంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో చేనేత కార్మికుల ఉత్పత్తులకు, విక్రయాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు సందర్శించారు. వస్తువుల ఉత్పత్తి గురించి స్టాళ్ళు నిర్వహిస్తున్న మహిళ లను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో ముడా చైర్మన్ లక్ష్మన్ యాదవ్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి,జిల్లా ఎస్ పి జానకి,మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు,నాబార్డ్ సంస్థ అధికారులు,వివిధ సంఘాల చైర్మన్లు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.