ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కెరెల్లి గ్రామంలో రహదారి పనుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహంతో మెరుపు ధర్నాకు దిగారు. తాండూరు–హైదరాబాద్ రోడ్డుపై సుమారు గంటసేపు వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, ఆసుపత్రికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలల క్రితం సీసీ రోడ్డు నిర్మాణం పేరుతో తవ్విన రహదారి ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో గ్రామం మొత్తం దుమ్ముతో కప్పుకుపోయింది. రోజూ భారీ వాహనాల రాకపోకల వల్ల ఎగిసిపడుతున్న దుమ్ము ఇళ్లలోకి, పాఠశాలలలోకి చేరి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా చిన్నారులు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, జలుబు వంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము ప్రభావంతో పంటల పెరుగుదల కూడా దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. పలుమార్లు సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారు. సమాచారం అందుకున్న ధారూర్ ఎస్ఐ రాఘవేందర్ ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ధర్నాను విరమించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులను పూర్తి చేసి, గ్రామాన్ని దుమ్ము సమస్య నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. give me tagsm,permlink, with ,comass in english
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.