Take a fresh look at your lifestyle.

కాప్రా లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

 

ముద్ర కాప్రా

మహాత్మ జ్యోతి రావు పూలే 199 వ జయంతి సందర్భంగా సైనిక్ పూరి లోని ఆయన విగ్రహానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, పల్లి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ,మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు


ఈ సందర్భగా ఎంపీ ఈటల రాజేందర్,ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
మహాత్మ జ్యోతి రావు పూలే ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారని, చదివే మన ఆర్థిక మూలాలకు కారణమని,చదువుకుంటే సామాజిక ఆర్థిక విధానాలలో ప్రజలు మార్పు చెందుతారని, బాల్యవివాహాలను వితంతు వివాహాలను కుల నిర్మూలనను అరికట్టాలంటే, అందరమూ ఈ సంఘంలో కొన్ని సంస్కరణ చేయాలని దానికి అందరం కూడా నడుం బిగించాలని ముఖ్యంగా మహిళల అభ్యున్నతి చదువు వలన సాధ్యమని, సావిత్రిబాయి పూలే కు చదువులు నేర్పి మహిళలకు ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.