Take a fresh look at your lifestyle.

పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి

 

కోరుట్ల, ముద్ర;
భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దివస్ సందర్భంగా కథలాపూర్ మండల పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర్ రావు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ, పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.

భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ, దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందనీ, అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోంది.

“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ ముందుకు సాగుతోంది. చిన్న స్థాయి నుండి ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ ప్రయాణం ప్రతి కార్యకర్తకు ప్రేరణగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉత్సాహభరితంగా స్థాపన దివస్ వేడుకలను నిర్వహించారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల సేవలో ముందుండాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.